News June 10, 2024
నష్టాలను అనుకూలంగా మార్చుకుంటున్నారు!
స్టాక్ మార్కెట్ల ఒడుదొడుకులను సామాన్య ఇన్వెస్టర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంచనాలకు భిన్నంగా ఫలితాలు రావడంతో JUN 4న FII, మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.19వేల కోట్ల షేర్లు విక్రయమయ్యాయి. ఇదే అదనుగా రిటైల్ ఇన్వెస్టర్లు రూ.21వేల కోట్ల షేర్స్ కొన్నారు. ఆ తర్వాతి సెషన్లలోనూ కొనుగోళ్లు కొనసాగాయి. లాస్‌లో ఉండగా కొని, లాభాలప్పుడు అమ్మాలనే రూల్‌ను మదుపర్లు ఫాలో అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News December 24, 2024
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రులతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తారు. రేపు రాత్రి అమరావతికి తిరిగొస్తారు.
News December 24, 2024
రష్యా ఆయిల్ దిగుమతి తగ్గింది.. మిడిల్ ఈస్ట్ నుంచి పెరిగింది
మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి NOVలో భారత్ క్రూడాయిల్ కొనుగోళ్లు 9 నెలల గరిష్ఠానికి చేరాయి. గత నెల ప్రతి రోజూ 2.28M బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి జరిగింది. OCTతో పోలిస్తే ఇది 10.8% ఎక్కువ. ఇది మొత్తం దేశీయ క్రూడాయిల్ దిగుమతుల్లో 48%. ఇదే సమయంలో రష్యా నుంచి దిగుమతి తగ్గడం గమనార్హం. OCTలో రోజూ 1.58 మిలియన్ బ్యారెళ్ల కొనుగోళ్లు జరగగా, NOVలో 13% తగ్గింది. మొత్తం దిగుమతుల్లో ఇది 32%.
News December 24, 2024
బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరం?
BGTలో భారత్‌కు తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను ఇంకా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఆసీస్ ప్రాక్టీస్ సెషన్‌లోనూ హెడ్ కనిపించలేదని తెలుస్తోంది. ఇవాళ జరిగే ఫిట్‌నెస్ టెస్టు తర్వాత నాలుగో టెస్టులో ఆడేది లేనిది క్లారిటీ రానుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హెడ్ 3 టెస్టుల్లో 2 సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.