News June 10, 2024
వైఎస్ జగన్‌కు నారా లోకేశ్ వార్నింగ్
AP: వైఎస్ జగన్ ఓడిపోయినా రక్తచరిత్ర రాస్తూనే ఉన్నాడని TDP నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన TDP నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారు. ఫ్యాక్షన్ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపినట్లే జనాన్ని చంపుతూ ఉన్నాడు జగన్ రెడ్డి. హత్యారాజకీయాలు ఇకనైనా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Similar News
News December 24, 2024
పోలీసుల వద్ద అల్లు అర్జున్ భావోద్వేగం
థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు అల్లు అర్జున్‌ను ఈ రోజు విచారించిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన వీడియోను అధికారులు చూపించగా.. బన్నీ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. మొత్తం 3.35 గంటల పాటు సాగిన విచారణలో బన్నీ తన కారులోని బిస్కెట్స్, డ్రైఫ్రూట్స్ మాత్రమే తిని టీ సేవించారని తెలుస్తోంది. దర్యాప్తులో కొన్ని ప్రశ్నలకు ఆయన తెలీదని జవాబిచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
News December 24, 2024
ఆ నిర్మాణాలు కూల్చం: హైడ్రా కమిషనర్
TG: హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులన్నీ చెల్లుతాయని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైడ్రా వచ్చాక జరుగుతున్న అక్రమ నిర్మాణాలనే కూల్చుతామన్నారు. FTLలో ప్రజలు నివాసం ఉంటున్న భవనాలను కూల్చబోమని ప్రకటించారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రజల్లో చైతన్యం పెరిగిందని, స్థలాలు కొనేవారు అన్నీ చెక్ చేసుకుంటున్నారని చెప్పారు.
News December 24, 2024
లోయలోపడ్డ ఆర్మీ వాహనం వివరాలు ఇవే
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో 350 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం 11 Madras Light Infantry (11 MLI)కి చెందినదిగా అధికారులు గుర్తించారు. 18 మంది జవాన్లతో కూడిన వాహనం నీలం హెడ్‌క్వార్టర్స్ నుంచి బాల్నోయి ఘోరా పోస్ట్‌కు బయలుదేరగా మార్గంమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. 11 MLIకు చెందిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. జవాన్ల మృతిపై White Knight Corps సంతాపం ప్రకటించింది.