News June 10, 2024

BJP నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు

image

BJP ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయాపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పలువురు మహిళలను లైంగికంగా వేధించారని RSS సభ్యుడు శాంతను సిన్హా ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సైతం డిమాండ్ చేస్తోంది. అయితే తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారంటూ శాంతనుపై మాలవీయా రూ.10కోట్ల పరువునష్టం దావా వేశారు.

Similar News

News December 24, 2024

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు

image

AP: సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏ-1గా సంజయ్, ఏ-2గా సౌత్రికా టెక్నాలజీస్, ఏ-3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌ను చేర్చింది. కాగా గతంలో సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో సంజయ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

News December 24, 2024

OYO బుకింగ్స్‌లో హైదరాబాద్ టాప్

image

ప్రముఖ హోటల్ బుకింగ్ యాప్ ‘OYO’ ఈ ఏడాది ‘ట్రావెలోపీడియా-2024’ పేరిట నివేదిక విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ అత్యధికంగా బుకింగ్స్ చేసిన నగరంగా నిలిచింది. దీని తర్వాత బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాలు ఉన్నాయి. ఇక పూరీ, వారణాసి, హరిద్వార్ నగరాలు ఎక్కువగా ప్రయాణించే ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. కాగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక మొత్తంలో బుకింగ్స్ అయ్యాయి.

News December 24, 2024

పోలీసుల వద్ద అల్లు అర్జున్ భావోద్వేగం

image

థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు అల్లు అర్జున్‌ను ఈ రోజు విచారించిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన వీడియోను అధికారులు చూపించగా.. బన్నీ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. మొత్తం 3.35 గంటల పాటు సాగిన విచారణలో బన్నీ తన కారులోని బిస్కెట్స్, డ్రైఫ్రూట్స్ మాత్రమే తిని టీ సేవించారని తెలుస్తోంది. దర్యాప్తులో కొన్ని ప్రశ్నలకు ఆయన తెలీదని జవాబిచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.