News June 10, 2024
హెరిటేజ్ షేర్లకు రెక్కలు.. CBN ఫ్యామిలీకి రూ.1200 కోట్లు లాభం
APలో TDP తిరిగి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు డబుల్ అయ్యాయి. మే 23న రూ.354.5 ఉన్న షేర్ విలువ ఇప్పుడు డబుల్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మే 23న CBN సతీమణి భువనేశ్వరి (24.37%), కుమారుడు నారా లోకేశ్ (10.82%)ల షేర్ల విలువ రూ.1,100 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.1200 కోట్లు పెరిగి రూ.2,300 కోట్లకు చేరింది.
Similar News
News December 22, 2024
723 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్
ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC)లో 723 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేటితో గడువు ముగియనుంది. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ పాసైనవారు అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.18వేలు-రూ.92,300 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
News December 22, 2024
రూ.20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
అస్సాంలోని కాచార్ జిల్లాలో ₹20 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఆపరేషన్ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సిల్కూరి రహదారిపై మోటర్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద ఈ సబ్‌స్టాన్సెస్ పట్టుబడ్డాయి. నిందితుడు సాహిల్ నుంచి 60 వేల యాబా టాబ్లెట్లు, 125 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాబా అనేది మెథాంఫెటమైన్, కెఫీన్ ఉత్ప్రేరకం.
News December 22, 2024
రేవంత్ అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేశారు: బండి సంజయ్
సీఎం రేవంత్ సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేసేలా రేవంత్ వ్యాఖ్యానించారు. ముగిసిన సమస్యపై అసెంబ్లీలో MIM సభ్యుడితో ప్రశ్న అడిగించారు. సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్య సృష్టించారు. ఇది ప్రణాళిక ప్రకారం అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర. రేవంత్ కక్ష సాధింపు చర్యలు వీడాలి’ అని సూచించారు.