News June 10, 2024
మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ హవా!

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మే నెలలో 83.42% పెరిగి రూ.34,697కోట్లకు చేరినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (AMFI) వెల్లడించింది. మే నెలలో నికరంగా రూ.30వేల కోట్లకుపైగా పెట్టుబడులు నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా సెక్టోరల్ & థిమేటిక్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.19,213.43 కోట్ల కొనుగోళ్లు రికార్డ్ అయ్యాయి. SIPల ద్వారా మేలో రూ.20,904కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
Similar News
News September 11, 2025
మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించింది పింక్ డైమండ్ కాదు: ASI

తిరుమల శ్రీవారికి 1945లో మైసూరు మహారాజు జయచామరా రాజేంద్ర వడియార్ సమర్పించింది పింక్ డైమండ్ కాదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆలయంలోని పింక్ డైమండ్ మాయమైందని 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో దీనిపై ASI అధ్యయనం చేసింది. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది హారం అని, అందులో కెంపులు, రత్నాలు మాత్రమే ఉన్నాయని ASI డైరెక్టర్ వెల్లడించారు.
News September 11, 2025
ఏపీ, తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు టీజీలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
News September 11, 2025
OTTలోకి వచ్చేసిన రజినీకాంత్ ‘కూలీ’

రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.