News June 10, 2024
చంద్రబాబు విక్టరీతో ఆంధ్రా కంపెనీల జోరు!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో ఆంధ్రా కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. గత నాలుగు సెషన్లలో KCP స్టాక్స్ 50%, అమరరాజా 32%, ఆంధ్రా షుగర్స్ 21%, అవంతీ ఫీడ్స్ 28%, లారస్ ల్యాబ్ 10%, నెల్‌కాస్ట్ అడ్వాన్సింగ్ 13% వృద్ధి చెందాయి. మరోవైపు కల్లం టెక్స్‌టైల్స్ 19%, విరాట్ క్రేన్ ఇండస్ట్రీస్ 23%, ఆంధ్రా సిమెంట్స్ 24%, క్రేన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 40%, ఆంధ్రా పెట్రోకెమికల్ షేర్లు 32% పెరిగాయి.
Similar News
News September 11, 2025
ఏపీ, తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా ఏపీలోని అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు టీజీలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
News September 11, 2025
OTTలోకి వచ్చేసిన రజినీకాంత్ ‘కూలీ’

రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
News September 11, 2025
ఇంటర్‌లో ప్రవేశాలు.. రెండు రోజులే ఛాన్స్

TG: ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు ఆన్‌లైన్ <