News June 10, 2024

త్వరలో ఇటలీకి ప్రధాని మోదీ!

image

మూడో టర్మ్‌లో తొలి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటలీలో ఈనెల 13-15 మధ్య జీ7 సదస్సు జరగనున్న నేపథ్యంలో మోదీ ఆ దేశంలో పర్యటించనున్నట్లు సమాచారం. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానాన్ని మోదీ స్వాగతించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. జూన్ 14న జరిగి సమావేశంలో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జీ7 దేశాల నేతలతో ప్రధాని సమావేశమయ్యే అవకాశం ఉంది.

Similar News

News October 6, 2024

ఉజ్వల భవిష్యత్తుకు ప్రపంచ శాంతి అవసరం: మోదీ

image

మాన‌వాళి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌పంచ శాంతి అత్య‌వ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని మోదీ పున‌రుద్ఘాటించారు. దేశాల మ‌ధ్య ఐక్య‌త‌, భాగ‌స్వామ్యం ద్వారానే సామూహిక ప్ర‌య‌త్నాల విజ‌యం ఆధారప‌డి ఉంద‌న్నారు. ICJ-ICWకు రాసిన లేఖ‌లో ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు, న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, రచయితలు, సంపాదకులు, న్యాయ విద్యావేత్తల భాగ‌స్వామ్యం ప్రపంచ శాంతికి విధానాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మ‌ని పేర్కొన్నారు.

News October 6, 2024

WOW.. 65 అడుగుల దుర్గామాత విగ్రహం

image

ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం మాదిరిగా ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పారు. కోఠిలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న విక్టరీ ప్లే గ్రౌండ్‌లో ఏకంగా 65 అడుగుల ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారు సింహ వాహనంపై మహాశక్తి అవతారంలో కనిపిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ లానే దుర్గామాత విగ్రహాన్ని కూడా ఉన్నచోటే తయారు చేయించారు.

News October 6, 2024

గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు వీరే

image

TGలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గద్వాల – N.శ్రీనివాసులు, MBNR – మల్లు నర్సింహారెడ్డి, వికారాబాద్ – శేరి రాజేశ్‌రెడ్డి, నారాయణపేట్ – వరాల విజయ్, కామారెడ్డి – మద్ది చంద్రకాంత్‌రెడ్డి, సంగారెడ్డి – G.అంజయ్య, వనపర్తి – G.గోవర్ధన్, RR – ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, కరీంనగర్ – సత్తు మల్లయ్య, నిర్మల్ – సయ్యద్ అర్జుమాండ్ అలీ, సిరిసిల్ల – నాగుల సత్యనారాయణ.