News June 10, 2024

చిత్తూరు: సెలవులపై వెళ్లిన టీటీడీ ఈవో

image

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఏపీ ప్రభుత్వం వారం రోజులు పాటు సెలవు మంజూరు చేసింది. అయితే రాష్ట్రం దాటి పోరాదని నిబంధన విధించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న ధర్మారెడ్డి సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరిస్థితుల్లో వారం రోజులు పాటు సెలవు మంజూరు చేస్తూ రాష్ట్రం దాటి పోకుండా నిబంధన విధించడం సంచలనంగా మారింది.

Similar News

News January 2, 2026

చిత్తూరు: 59 వేల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

image

జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో 59,701 పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని 298 గ్రామాల పరిధిలోని అర్హులకు అందజేయనున్నట్టు ఆయన వెల్లడించారు. రీ సర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికను ఉపయోగించి కచ్చితంగా భూ హద్దులను నిర్ణయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అధికారులు.. ప్రజాప్రతినిధులతో కలిసి అందజేస్తారని చెప్పారు.

News January 2, 2026

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులను పరిశీలించి రికార్డులపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 2, 2026

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

image

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలోని రైతులకు అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల మండలం వసంతాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల తొమ్మిది వరకు జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించి నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.