News June 10, 2024
స్పీకర్ పదవిపై టీడీపీ, జేడీయూ కన్ను?(2/2)

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పార్టీలు సభాపతి స్థానాన్ని ఆశిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా స్పీకర్ సభలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. గతంలో స్పీకర్‌గా ఎన్నికైన నీలం సంజీవరెడ్డి పారదర్శకంగా వ్యవహరించేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు జరగలేదు. అయితే మిత్రపక్షాలకు సభాపతి పదవిని BJP కట్టబెడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News September 11, 2025
నన్ను టార్గెట్ చేస్తున్నారు: గడ్కరీ

ఇథనాల్ పెట్రోల్‌పై సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పెయిడ్ పొలిటికల్ క్యాంపెయిన్ జరుగుతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. కొందరు తనను టార్గెట్ చేస్తున్నారని, ఆ ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరారు. E20 పెట్రోల్ సురక్షితం అని, దాన్ని ప్రభుత్వ నియంత్రణ సంస్థలతో పాటు ఆటోమొబైల్ కంపెనీలు స్వాగతించాయని పేర్కొన్నారు. కాగా E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతోందనే ప్రచారం జరుగుతోంది.
News September 11, 2025
ALERT: కాసేపట్లో భారీ వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే మెదక్‌లో 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. అటు హైదరాబాద్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు దంచికొడుతున్నాయి.
News September 11, 2025
4.61 ఎకరాలకు రూ.3,472 కోట్లు!

ముంబైలో RBI భారీ ధరకు 4.61 ఎకరాలను కొనుగోలు చేసింది. నారీమన్ పాయింట్‌లో ఉన్న ప్లాట్ కోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. అంటే ఒక ఎకరానికి దాదాపు రూ.800 కోట్లు. స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు అయ్యాయి. ఈ ఏడాది ఇండియాలో ఇదే అతిపెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్ అని సమాచారం. ఆ ప్లాటు సమీపంలోనే బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.