News June 11, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి
* పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు
* గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్
* హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్
* భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మంత్రిగా శ్రీనివాసవర్మ
* PMAY కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం చేయాలని కేబినెట్ నిర్ణయం
* రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన వైసీపీ నేత కేశినేని నాని

Similar News

News December 22, 2024

మనవడి రికార్డు.. చంద్రబాబు ప్రశంసలు

image

నారా వారసుడు దేవాన్ష్ <<14952633>>ప్రపంచ రికార్డు<<>> సృష్టించడంతో తాత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Xలో సంతోషం వ్యక్తం చేశారు. కృషి, పట్టుదల, అంకితభావం విజయానికి కీలకమని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొన్ని నెలలుగా దేవాన్ష్ పడిన కష్టాన్ని చూసి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాన్ష్‌ నిబద్ధత కళ్లారా చూశామని, ఈ ఘనత అందుకోవడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు లోకేశ్, బ్రహ్మణి ట్వీట్ చేశారు.

News December 22, 2024

క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవులపై కొందరు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 25, 26న పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఆ రెండు రోజులు స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఉంటాయి. 24న ఆప్షనల్ హాలిడే ఉండటంతో కొన్ని స్కూళ్లు ఆ రోజూ సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో 25న మాత్రమే పబ్లిక్ హాలిడే ఉండగా, 24, 26 తేదీల్లో ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చారు.

News December 22, 2024

రాహుల్ గాంధీ ఫ్యామిలీ లంచ్

image

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన కుటుంబంతో సరదాగా గడిపారు. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకలతో కలిసి లంచ్ చేశారు. అందులో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరయా కూడా ఉన్నారు. ఈ ఫొటోలను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.