News June 11, 2024
ఈనెల 28వ తేదీ నుంచి ఓయూ ఎంబీఏ పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. SHARE IT
Similar News
News September 17, 2025
HYDలో గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు

తెల్లవారుజామునుంచే HYDలోని ప్రముఖ గోల్డ్ షాపు యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తోంది. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. వరంగల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
News September 17, 2025
JNTUలో 198 ఎంటెక్ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

JNTU యూనివర్సిటీలో ఎంటెక్ విభాగానికి సంబంధించి స్పాన్సర్ క్యాటగిరీలో స్పాట్ అడ్మిషన్లకు అధికారుల సిద్ధమయ్యారు. ఈ నెల 18 నుంచి 20 వరకు యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలో 198 సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. ఉ.10 గంటల నుంచి సా.6 గంటల వరకు అడ్మిషన్లకు సంబంధించి ప్రక్రియ నిర్వహిస్తామని ఆయన అన్నారు.
News September 17, 2025
చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద సంచిలో మహిళ డెడ్‌బాడీ

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. దుండగులు ఆమెను హత్య చేసి, సంచిలో కుక్కి ఆటో స్టాండ్ వద్ద పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.