News June 11, 2024
నేడు విజయవాడలో టీడీపీ శాసనసభా పక్ష సమావేశం

విజయవాడలో మంగళవారం టీడీపీ కూటమి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు ఏ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశంలో శాసనసభా పక్షనేతగా చంద్రబాబును టీడీపీ కూటమి పక్షాలు ఎన్నుకోనున్నాయి. అనంతరం తీర్మాన ప్రతిని రాష్ట్ర గవర్నర్కు కూటమి నేతలు అందజేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కూటమి బృందం కోరనుంది.
Similar News
News January 17, 2026
GNT: కలెక్టర్ని కలిసిన జీఎంసీ కమిషనర్

గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ కె. మయూర్ అశోక్ శనివారం కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియాను కలిశారు. కార్పొరేషన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన కమిషనర్ కలెక్టర్ని కలిసి ఆమెకు మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ది, ఇతర కీలక అంశాలపై ఇరువురు చర్చించారు.
News January 16, 2026
GNT: డెల్టా ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు జాక్పాట్

17626 డెల్టా ఎక్స్ప్రెస్లో ఏర్పడిన సాంకేతిక, అంతర్గత సమస్యల నేపథ్యంలో S10, S11 స్లీపర్ కోచ్ల ప్రయాణికులను రైల్వే అధికారులు ఉచితంగా 3rd AC కోచ్కు అప్గ్రేడ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండానే ఈ ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రయాణంలో ఎలాంటి అంతరాయం లేకుండా సిబ్బంది సమర్థంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి రోజున లభించిన ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు “జాక్పాట్”గా అభివర్ణిస్తున్నారు.
News January 15, 2026
సైనికుల ఖార్ఖానా.. బావాజీపాలెం

నేడు జాతీయ సైనిక దినోత్సవం. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిని ‘జవాన్ల ఊరు’గా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు సైన్యంలో పనిచేస్తుండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం నుంచి నేటి వరకు ఇక్కడి వారు దేశసేవలో తరిస్తున్నారు. యువత ఉదయాన్నే మైదానంలో కసరత్తులు చేస్తూ, ఆర్మీలో చేరడమే ఏకైక లక్ష్యంగా శ్రమిస్తుంటారు.


