News June 11, 2024

పేటీఎంలో మరిన్ని లేఆఫ్స్

image

నష్టాల్లో ఉన్న పేటీఎం పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి 3,500 మందికి లేఆఫ్స్ ఇవ్వగా, తాజాగా మరింత మందిని తొలగించినట్లు వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. అయితే సంఖ్యను వెల్లడించలేదు. వీరు ఇతర కంపెనీల్లో జాబ్ సంపాదించేందుకు తాము సాయపడుతున్నామంది. ప్రస్తుతం పేటీఎంలో దాదాపు 35వేల మంది పనిచేస్తున్నారు. ఈ సంస్థకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.550 కోట్ల నష్టాలు వచ్చాయి.

Similar News

News December 22, 2024

సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి

image

TG: సంక్రాంతి నుంచి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరదలకు ఉప్పొంగిన మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు.

News December 22, 2024

ఆ దేశంతో టెస్టు సిరీస్ ఆడలేకపోయిన అశ్విన్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని దేశాలతో టెస్టు మ్యాచులు ఆడారు. కానీ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మాత్రం ఒక్క టెస్టు కూడా ఆడకుండానే రిటైర్మెంట్ ఇచ్చారు. భారత్-పాక్ మధ్య 2008 నుంచి టెస్టు సిరీస్ జరగలేదు. అశ్విన్ 2011లో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఇరు దేశాల మధ్య ఒక్క టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు. దీంతో ఆయన ఆ దేశంతో ఆడలేకపోయారు.

News December 22, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కోనసీమ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అలాగే ఎల్లుండి ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.