News June 11, 2024
‘బౌలర్లు మ్యాచులు గెలిపిస్తారు’.. స్టెయిన్ ట్వీట్ నిజమైందిగా!!

సౌతాఫ్రికా బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ 2021లో చేసిన ట్వీట్ నిజమైంది. ‘బ్యాటర్లు ప్రేక్షకులను అలరిస్తారు. బౌలర్లు మ్యాచులు గెలిపిస్తారు’ అని స్టెయిన్ 2021లో ట్వీట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే యార్కర్ కింగ్ బుమ్రా.. మొన్న PAKపై అద్భుతంగా రాణించి భారత జట్టును గెలిపించారు. గెలుపు అసాధ్యమనుకున్న అంచనాలను తలకిందులు చేసి మరపురాని విజయాన్ని అందించారు.
Similar News
News January 16, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 83,619 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 25,712 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, టెక్ మహీంద్రా, M&M, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.313 వద్ద ప్రారంభమైంది.
News January 16, 2026
నేడు ఆవులను ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.
News January 16, 2026
పీరియడ్ పెయిన్స్ తగ్గించే ఫుడ్ ఇదే..

నెలసరి సమయంలో కొందరికి విపరీతంగా కడుపు, నడుంనొప్పి వస్తుంటాయి. వీటిని తగ్గించాలంటే కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. నానబెట్టిన ఎండు ద్రాక్ష, చేమ దుంప, చిలగడదుంప వంటి దుంపజాతి కూరగాయలు తినడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే అరటిపండు, అరటి కాయ, అరటి పువ్వును వంటకాల్లో భాగం చేసుకొని తీసుకోవచ్చు. హార్మోన్లను సమతులంగా ఉంచడంలో అరటి పువ్వు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.


