News June 11, 2024

‘NOKIA 3210’ మళ్లీ వచ్చేసింది..

image

మొబైల్ అమ్మకాల్లో నోకియాను నంబర్-1గా నిలబెట్టిన ‘NOKIA 3210’ మోడల్ మళ్లీ వచ్చేసింది. HMD గ్లోబల్ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌పై ఇండియన్ మార్కెట్లో దీన్ని లాంఛ్ చేసింది. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2MP కెమెరా, 64 MB RAM, USB TYPE-C పోర్ట్ ఉంటాయి. యూట్యూబ్, న్యూస్, గేమ్స్ కోసం వేర్వేరు యాప్స్ ఇచ్చారు. ఎంతో ఫేమస్ అయిన స్నేక్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. డ్యుయల్ సిమ్ 4G voLTE సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది. ధర రూ.3,999.

Similar News

News December 26, 2024

కొత్త ఇల్లు కట్టుకునే వారికి GOOD NEWS

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.260, టన్ను స్టీల్ రూ.54 వేల వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇసుక ఇప్పటికే ప్రభుత్వ అధీనంలో ఉంది.

News December 26, 2024

నేడు కర్ణాటకకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు కర్ణాటకకు వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ ఎన్నికై వంద సంవత్సరాలు గడిచిన సందర్భంగా బెల్గాంలో రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. అందులో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.

News December 26, 2024

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

image

AP: క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జరిగింది. అంగలూరికి చెందిన కొమ్మాలపాటి సాయి(26) HYDలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న క్రిస్మస్ సెలవు కావడంతో ఇంటికి వచ్చి స్నేహితులతో క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లాడు. బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే గుడివాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.