News June 11, 2024
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై కొత్త ఆశలు

శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడికి కేంద్ర విమానయాన శాఖ దక్కడం, ఏపీలో కూటమి గెలవడంతో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు ఈ విమానాశ్రయం తలమానికం. దీని విస్తరణతో పాటు రూ.133కోట్లతో టెర్మినల్ భవన నిర్మాణానికి 4ఏళ్ల కిందే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా.. ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. తాజాగా తెలుగు వ్యక్తి విమానయాన శాఖ మంత్రి కావడంతో ఆశలకు కొత్త రెక్కలొస్తున్నాయి.
Similar News
News November 3, 2025
మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు

బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అధిష్ఠానం ఆయనను నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన వీర్రాజు ఇకపై పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకపదవిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News November 3, 2025
నేడు యథాతథంగా పీజీఆర్‌ఎస్: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని ఆమె సూచించారు. ఫిర్యాదులను 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా Meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 2, 2025
1,185 కుటుంబాలకు రూ.23.26 లక్షల సాయం: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో 1,185 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.23.26 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మొంథా’ తుపాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో మండల స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.


