News June 11, 2024
ఉమ్మడి ప్రకాశంలో మంత్రి పదవులపై తీవ్ర ఉత్కంఠ

రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుకానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ సాగుతోంది. ఈరోజు విజయవాడలో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు సైతం రేసులో ఉన్నారు
Similar News
News September 13, 2025
రేగలగడ్డలో భార్యను చంపి, భర్త ఆత్మహత్యాయత్నం

మర్రిపూడిలోని రేగలగడ్డలో దారుణం జరిగింది. నారాయణ భార్య అంజమ్మను శుక్రవారం రాత్రి గొంతుకోసి చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంజమ్మ చనిపోగా.. నారాయణ కొన ఊపిరితో ఉన్నాడు. గ్రామస్థులు సమాచారం పోలీసులకు అందజేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 12, 2025
ప్రకాశం: బార్ల లైసెన్సులకు గడువు పొడిగింపు

ప్రకాశం జిల్లాలోని 4 ఓపెన్ కేటగిరి బార్ల లైసెన్సులకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 ఓపెన్ బార్ల లైసెన్స్ల కొరకు దరఖాస్తు గడువు గతంలో 14వ తేదీ వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ గడువు తేదీని 17 వరకు పొడిగించామన్నారు.
News September 12, 2025
ఉలవపాడు: బాలికపై సచివాలయం ఉద్యోగి అత్యాచారం

ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా చేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేసింది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.