News June 11, 2024
పవన్‌కి కన్ఫర్మ్.. ఇంకా ఎవరెవరికో మంత్రి పదవులు

ఉమ్మడి తూ.గో జిల్లాలో మంత్రి పదవి ఆశావహులు భారీగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కి దాదాపు కన్ఫర్మ్ కాగా.. జనసేన కోటాలో కందుల దుర్గేశ్, BJP కోటాలో నల్లమిల్లికి అమాత్య యోగం ఉన్నట్లు తెలుస్తోంది. యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేర్లు బలంగా వినిపిస్తుండగా.. బుచ్చయ్యచౌదరి, వనమాడి కొండబాబు, సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు సహా తొలిసారి ఎన్నికైన పలువురు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
Similar News
News November 3, 2025
నేడు యథాతథంగా పీజీఆర్‌ఎస్: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా తమ డివిజన్, మండల కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీలు సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందాలని ఆమె సూచించారు. ఫిర్యాదులను 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా Meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 2, 2025
1,185 కుటుంబాలకు రూ.23.26 లక్షల సాయం: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో 1,185 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.23.26 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మొంథా’ తుపాను ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో మండల స్థాయిలో లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
News November 2, 2025
తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా

కార్తీక మాసం కారణంగా తాళ్లపూడి మండలంలో మాంసం విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆదివారం నాటికి కిలో చికెన్ రూ.200-220 పలుకుతుండగా, నాటుకోడి రూ.600, మేక మాంసం రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు గణనీయంగా తగ్గడంతో వ్యాపారం మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయగలరు.


