News June 11, 2024
ఒంగోలు: స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాలి: కలెక్టర్

స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన, సమావేశంలో అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతులు పొందిన స్కానింగ్ కేంద్రాలు తిరిగి రెన్యువల్ చేసుకున్నారా లేదా కూడా పరిశీలించాలన్నారు. సమావేశంలో ఆరోగ్య శాఖకు చెందిన శ్రీధర్ రావు, డీఎంహెచ్‌వో సురేష్, నాగార్జున తదితర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 3, 2025
ప్రకాశం జిల్లా ప్రజలకు SP కీలక సూచనలు..!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు SP హర్షవర్ధన్ రాజు ఆదివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితోపాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాల్లో మన అప్రమత్తతే మనకు రక్షని సూచించారు.
News November 2, 2025

వారికి రూ.10,000 బహుమతి: ఎమ్మెల్యే ఉగ్ర

జాతీయ రహదారి భద్రతను కాపాడటం మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. హైవే రోడ్డుపై ఇళ్ల నిర్మాణాల నుంచి వచ్చిన శిథిలాలు, మట్టి, వ్యర్థాలను రహదారి పక్కన వేస్తున్న వారి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కన శిధిలాలు వేసిన వారి వివరాలు లేదా ఫొటోలు, వీడియో సాక్ష్యాలు అందించిన వారికి రూ.10,000 బహుమతి అందజేస్తామని తెలిపారు.