News June 11, 2024
ప.గో: అమాత్యయోగం ఎవరికో..?

ఉమ్మడి ప.గో జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ, హ్యాట్రిక్ MLA నిమ్మల రామానాయుడు, ఉండి MLA రఘురామకు అమాత్యయోగం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రాతిపదికన ఫైర్ బ్రాండ్ MLA చింతమనేని పేరు, BJP కోటాలో కైకలూరు MLA కామినేని శ్రీనివాస్, జనసేన నుంచి బొలిశెట్టి, పులపర్తి రామాంజనేయులు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
Similar News
News November 3, 2025
భీమవరం: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) యథావిధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News November 2, 2025
ఉండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉండి మండలం నక్కరాజగుంట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండి నుంచి ఆకివీడు వెళుతున్న గంధం రాఘవులు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News November 2, 2025
బియ్యం బస్తా మోసిన ఎమ్మెల్యే నాయకర్

తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన వేములదీవిలో శనివారం నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో 50 కేజీల బియ్యం బస్తా, ఇతర సరుకులను ఇంటికి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగురాలిని ఎమ్మెల్యే నాయకర్ గమనించారు. వెంటనే ఆయనే స్వయంగా బియ్యం బస్తాతో సహా సరుకులన్నింటినీ తన భుజాలపై మోసుకుని, ఆమె త్రిచక్ర వాహనం వరకూ చేర్చారు. ఆపదలో ఉన్న బాధితురాలికి ఎమ్మెల్యే చేసిన సాయం ఆదర్శంగా నిలిచింది.


