News June 11, 2024
ఏపీకి అర్బన్ డెవలప్మెంట్ ఇస్తే బాగుండేదని అభిప్రాయం!
NDAలో కీలకమైన టీడీపీకి ప్రాధాన్యమైన శాఖలు దక్కలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా కల్గిన విమానయాన శాఖ కేటాయించినా ఏపీకి అంతగా ప్రయోజనం ఉండదంటున్నారు. అర్బన్ డెవలప్మెంట్ ఇస్తే అమరావతి అభివృద్ధి వేగవంతం అయ్యే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే మంత్రి పదవుల కన్నా కేంద్రనిధులపైనే టీడీపీ ఫోకస్ పెట్టినట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.
Similar News
News December 23, 2024
రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిటీ
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై పేసర్ ఆకాశ్ దీప్ క్లారిటీ ఇచ్చారు. ‘నెట్స్‌లో రోహిత్ మోకాలికి బంతి బలంగా తాకింది. నొప్పితో ఆయన కాసేపు విలవిల్లాడారు. ఆ తర్వాత ఐస్ ప్యాక్ పెట్టుకుని అరగంటపాటు రెస్ట్ తీసుకున్నారు’ అని ఆయన చెప్పారు. కాగా ఈ నెల 26న భారత్, ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది.
News December 23, 2024
పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం: హరీశ్ రావు
TG: అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఘటన పూర్తిగా పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ రావు ట్వీట్ చేశారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న CM రేవంత్ అడుగంటుతున్న శాంతిభద్రతల పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గడిచిన ఒక్క ఏడాదిలోనే HYDలో 35,994 క్రైమ్ కేసులు నమోదుకావడం ఘోరమైన పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాల్లో శాంతి భద్రతలు లేవనే విషయం స్పష్టమవుతోందని చెప్పారు.
News December 23, 2024
పడుకునే ముందు తింటున్నారా?
రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు భోజనం కానీ, ఇతర ఆహార పదార్థాలు కానీ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ మందగించడం, గుండెల్లో మంట, నిద్ర లేమి, ఊబకాయం సమస్యలు వేధిస్తాయి. ఇది గుండెజబ్బులు, షుగర్ ప్రమాదం పెంచుతుంది. రాత్రి తిన్న 3 గంటల తర్వాత పడుకోవాలి. ఏదీ అధిక పరిమాణంలో తీసుకోకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి.