News June 11, 2024
దూకుడు పెంచితే బందీలను కాల్చేయండి: హమాస్

ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచితే బందీలను చంపేయాలని హమాస్ నాయకత్వం ఫైటర్లను ఆదేశించింది. ఇటీవలే వీరి నుంచి నలుగురు బందీలను IDF రక్షించింది. ఈ క్రమంలో తమ సిబ్బంది, పాలస్తీనా పౌరులు మరణించారని ఆరోపిస్తూ ఉగ్ర సంస్థ ఈ ప్రకటన చేసింది. 2023 OCT 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 200 మందిని హమాస్ బంధించింది. వీరిని వేర్వేరు చోట్లకు తరలిస్తున్నట్లు డ్రోన్లు, శాటిలైట్లతో ఇజ్రాయెల్, USA సంయుక్త బృందం గమనిస్తోంది.
Similar News
News September 13, 2025
షాకింగ్: HD క్వాలిటీతో ‘మిరాయ్’ పైరసీ!

కొత్త సినిమాలను పైరసీ బెడద వీడట్లేదు. నిన్న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘మిరాయ్’ సినిమా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మూవీ HD క్వాలిటీతో అందుబాటులో ఉందని చెబుతున్నారు. ఇది దారుణమని, సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. మేకర్స్ దీనిపై దృష్టి పెట్టి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
News September 13, 2025
సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యం: CM చంద్రబాబు

AP: 15% వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌పై మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పౌరసేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని, దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో 3% వృద్ధి తగ్గడంతో రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపదను కోల్పోయిందన్నారు.
News September 13, 2025
కృష్ణా జలాల వాటాలో చుక్కనీటిని వదలొద్దు: రేవంత్

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని సీఎం రేవంత్ న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. నికర, మిగులు, వరద జలాల్లో చుక్క నీటిని వదులుకునేది లేదని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఆధారాలను సిద్ధం చేసి అందించాలని అధికారులు, న్యాయనిపుణులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరిగే ట్రిబ్యునల్ విచారణలో ఈ అంశాలను గట్టిగా వినిపించాలని సూచించారు.