News June 11, 2024
ఇగ్లండ్‌లో పల్నాడు జిల్లా యువకుడి మృతి

ఉన్నత చదువుల కోసం ఇగ్లండ్ వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన సాయిరాం (24) ఉన్నత చదువుల కోసం ఇగ్లండ్ వెళ్లాడు. అయితే ఈ నెల 2న మాంచెస్టర్ బీచ్ వద్ద సాయిరాం మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. అనంతరం మాంచెస్టర్ నుంచి పల్నాడు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 14, 2025
గుంటూరు జిల్లాలో దంచికొట్టిన వర్షం

గుంటూరు జిల్లాలో శనివారం వర్షం దంచికొట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో రాత్రి వరకు కురుస్తూనే ఉంది. వర్షంతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వీయడంతో ప్రజలు అసౌకర్యం వ్యక్తం చేశారు. పిడుగులు పడి పెదనందిపాడు మండలంలో ఇద్దరు, పెదకాకాని మండలంలో మరో ఇద్దరు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. పలు చోట్ల అధిక వర్షం కారణంగా కాలువలు నిండి నీరు రోడ్లపైకి చేరింది.
News September 14, 2025
గుంటూరు: నష్టపరిహారంగా రూ.1.11 కోట్లు

గుంటూరు జిల్లాలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 11,388 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 908, క్రిమినల్ కేసులు 10,480 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీనివాసుల కుటుంబానికి రూ.1.11 కోట్లు పరిహారం అందజేయడం ప్రధానంగా నిలిచింది. ప్రజలు సమయం, డబ్బు ఆదా చేసుకునేలా ఈ వేదికను మరింతగా వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు.
News September 13, 2025
గుంటూరు: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.