News June 11, 2024
విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు: చంద్రబాబు

రాష్ట్రంలో విశాఖ నగరానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ శాసనసభ పక్ష నేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో మంగళవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు అత్యంత ఆదరణ ఇచ్చిన విశాఖ నగరం దేశంలోనే పెద్ద నగరంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాం’. ఈ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
Similar News
News January 18, 2026
విశాఖ పోర్టుకు మరో రికార్డు

విశాఖ పోర్టు మరో చారిత్రక రికార్డు సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 289 రోజుల్లోనే 70 మిలియన్ టన్నుల (7,01,74,002 టన్నులు) సరకు రవాణా పూర్తి చేసింది. 2026 జనవరి 14 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. పోర్టు ఏర్పాటైన 92 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా సరకు రవాణా ఇదే తొలిసారి. గతంలో 2024-25లో 316 రోజులు, 2023-24లో 320 రోజులు పట్టాయి.
News January 18, 2026
విశాఖ: మాస్టర్ ప్లాన్ మార్చిలోనే..!

భోగాపురం ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని VMRDA మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. అయితే YCP ప్రభుత్వం ప్రకటించిన కొన్ని ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ప్రైవేట్ భూములకు సంబంధించిన అంశాల్లో ఎక్కువ మందికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూటమికి ఫిర్యాదులు అందాయి. ఈ అభ్యంతరాలపై సమీక్షించిన అనంతరం మార్చి నాటికి మాస్టర్ ప్లాన్‌ను ప్రకటిస్తామని VMRDA స్పష్టం చేసింది.
News January 18, 2026
సింహాచలం: సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం నేడే

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి తెప్పోత్సవం ఈరోజు సాయంత్రం వైభవంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు స్వామిని మెట్ల మార్గం గుండా కొండ దిగువ గల వరాహ పుష్కరణి వద్దకు తీసుకొస్తారు. సుమారు 5 గంటల ప్రాంతంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. వేణుగోపాల స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది.


