News June 11, 2024
ఈనెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక?
ఈనెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 రోజులపాటు సాగే ఈ సెషన్‌లో తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం స్వీకారం చేస్తారు. 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 23, 2024
సంక్రాంతి తర్వాత జన్మభూమి-2
AP: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంక్రాంతి తర్వాత జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరింత సమర్థవంతంగా పథకాల అమలు, అభివృద్ధి పనులపై ఫోకస్ చేయనున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అనుసంధానం చేశారు.
News December 23, 2024
IPO బూమ్: 90 సంస్థలు.. రూ.1.60 లక్షల కోట్లు
ఈ ఏడాది కంపెనీల ఐపీవోలకు అసాధారణ రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 90 సంస్థలు ఐపీవోల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.60 లక్షల కోట్ల నిధులను సేకరించాయి. దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ అత్యధికంగా రూ.27,870 కోట్లు, స్విగ్గీ రూ.11,327 కోట్లు, ఎన్టీపీసీ రూ.10వేల కోట్లను సమీకరించాయి. వచ్చే ఏడాది 75 సంస్థలు రూ.2.50 లక్షల కోట్ల సేకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి.
News December 23, 2024
సంక్రాంతికి జైలర్-2 ప్రకటన?
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో రజినీకాంత్ హీరోగా జైలర్-2 స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ప్రీప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఇందుకోసం సూపర్ స్టార్‌తో మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రికార్డ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ చిత్రీకరణ జరుగుతోంది.