News June 11, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాతం వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో 34.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 32.5 మి.మీ, గద్వాల జిల్లా తోతినొనిద్దోడి 32.1 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట 32.1 మి.మీ, వనపర్తి జిల్లా మదనపూర్ 31.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News January 12, 2025

NGKL: 3 నెలల క్రితం పెళ్లి.. వివాహిత సూసైడ్

image

వివాహిత ఉరేసుకున్న ఘటన కొల్లాపూర్ మం.లో జరిగింది. కుటుంబీకుల వివరాలు.. కుడికిల్లకు చెందిన భవాని(20)కి 3 నెలల క్రితం పెబ్బేరు మ. పాతపల్లి వాసి రాజేందర్‌తో పెళ్లైంది. శుక్రవారం పుట్టింటికి వచ్చిన భవాని.. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. డోర్ లాక్ చేసి ఉండటంతో స్థానికుల సహాయంతో భర్త పగలగొట్టారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమెను కొల్లాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయింది.

News January 12, 2025

NGKL: ‘పండగకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్తలు పాటించండి’

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు ఆయా జిల్లాల పోలీసులు అల్టర్ చేశారు. ఊరెళ్లేవారు విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచొద్దని బ్యాంకు లాకర్‌లో దాచుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ సూచించారు. ఇంటికి తాళం వేసేటప్పుడు డోర్ కాటన్ అడ్డంగా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇరుగు పొరుగు వారికి చెప్పాలని, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

News January 12, 2025

MBNR: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు.. APPLY చేసుకోండి

image

ఉమ్మడి జిల్లాలో గండీడ్, కోస్గి, కొత్తకోట, ధన్వాడ, వెల్దండ, కోడేరు, ఖిలా ఘనపూర్, పెబ్బేరు మండలాల్లో ఆదర్శ పాఠశాలలో ఉండగా.. 2025-26 విద్యా సంవత్సరానికి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 6వ తరగతికి నేరుగా..7,8,9,10వ తరగతిలో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
SHARE IT