News June 11, 2024

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్

image

సింగరేణి కారుణ్య నియామకాల్లో వారసుల వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ ప్రకటించారు. 2018 మార్చి 9 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News January 23, 2026

ట్రంప్ కంటే మోదీ పవర్‌ఫుల్: ఇయాన్ బ్రెమ్మర్

image

US అధ్యక్షుడు ట్రంప్ కంటే మన PM మోదీయే చాలా పవర్‌ఫుల్ అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ పదవి మరో మూడేళ్లలో పోతుందని.. కానీ మోదీకి దేశంలో తిరుగులేని మద్దతు ఉందని పేర్కొన్నారు. దీంతో మోదీ సంస్కరణలను దూకుడుగా అమలు చేయగలరని, విదేశీ ఒత్తిడి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలరని విశ్లేషించారు. ట్రంప్ కంటే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా బెటర్ పొజిషన్‌లో ఉన్నట్లు తెలిపారు.

News January 23, 2026

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు.. బుమ్రా మ్యాజిక్ ఇదే!

image

బుల్లెట్ల లాంటి యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే భారత స్టార్ బౌలర్ బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్‌ వల్ల ఎక్కువ రోజులు ఆడలేరన్న విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ పదేళ్లలో టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 103W తీశారు. 2024లో ICC క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు. రానున్న T20 WCలో IND బౌలింగ్ దళాన్ని బుమ్రానే నడిపించనున్నారు.

News January 23, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.5,400 పెరిగి రూ.1,59,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,950 ఎగబాకి రూ.1,46,400గా ఉంది. కిలో వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,60,000గా నమోదైంది.