News June 11, 2024
మితిమీరిన నమ్మకమే బీజేపీని ముంచింది: RSS
మితిమీరిన విశ్వాసంతో ఉన్న BJP నేతలకు ఈ ఎన్నికల ఫలితాలు బుద్ధి చెప్పాయని RSS తన మ్యాగజైన్ ‘ఆర్గనైజర్’లో విమర్శించింది. ఆ పార్టీ కార్యకర్తలు సహా చాలా మంది నేతలు మోదీ క్రేజ్ చూసి సంతోషించారే తప్ప ప్రజల గొంతుక వినిపించుకోలేదని పేర్కొంది. తమ వాలంటీర్ల సహాయం తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘400 పార్’ అని ప్రధాని మోదీ ఇచ్చిన నినాదాన్ని కార్యకర్తలు/నేతలు సీరియస్‌గా తీసుకోలేదని తెలిపింది.
Similar News
News December 23, 2024
పీవీ సింధు పెళ్లి జరిగింది ఇక్కడే
రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవిలో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం జరిగింది. ఆరావళి పర్వతాల మధ్యలోని ఈ దీవిలో వంద గదులతో రఫల్స్ సంస్థ ఈ భారీ రిసార్ట్‌ను నిర్మించింది. అతిథులను పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వారికోసం 100 గదులను సింధు ఫ్యామిలీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిసార్ట్‌లో ఓ గదికి ఒక రోజు అద్దె రూ.లక్ష ఉంటుందని సమాచారం.
News December 23, 2024
రైతు భరోసాపై ప్రభుత్వాన్ని నిలదీయండి: KTR
రైతు భరోసాపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ‘ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే రెండు పంట సీజన్లు అయిపోయాయి. మూడో సీజన్ కూడా వచ్చేసింది. ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి రూ.17,500 ప్రభుత్వం బాకీ పడింది. ఆంక్షలు విధించి లక్షలాది మందికి రైతు భరోసా ఎగ్గొట్టాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.
News December 23, 2024
శ్రీవారి భక్తుల కోసం అలిపిరిలో బేస్ క్యాంప్: శ్యామలరావు
AP: శ్రీవారి భక్తులు సులభంగా సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ‘చాట్ బాట్’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు TTD ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తుల వసతి కోసం అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటుచేస్తామన్నారు. రూ.70 లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతంగా ఏర్పాటుచేసుకున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాబులోకి వస్తుందని చెప్పారు. అన్నప్రసాదాలు,లడ్డూలు మరింత నాణ్యంగా అందిస్తున్నట్లు తెలిపారు.