News June 11, 2024
పారిస్‌లో ధోనీ, అశ్విన్ సందడి
క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ, మరో ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తమ కుటుంబాలతో కలిసి పారిస్‌లో విహరిస్తున్నారు. వారు ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ ధోనీ మెరిశారు. కాగా టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో అశ్విన్‌కు చోటు దక్కలేదు.
Similar News
News December 23, 2024
శ్రీవారి భక్తుల కోసం అలిపిరిలో బేస్ క్యాంప్: శ్యామలరావు
AP: శ్రీవారి భక్తులు సులభంగా సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ‘చాట్ బాట్’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు TTD ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తుల వసతి కోసం అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటుచేస్తామన్నారు. రూ.70 లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతంగా ఏర్పాటుచేసుకున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాబులోకి వస్తుందని చెప్పారు. అన్నప్రసాదాలు,లడ్డూలు మరింత నాణ్యంగా అందిస్తున్నట్లు తెలిపారు.
News December 23, 2024
ఘనంగా పీవీ సింధు వివాహం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచారు. ఈ వేడుకకు దాదాపు 140 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. వివాహ ఫొటోలను ఇరు ఫ్యామిలీలు ఇంకా విడుదల చేయలేదు. రేపు హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.
News December 23, 2024
జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
వచ్చే నెల 20 నుంచి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సుకు భారత్ నుంచి ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఇందులో పాల్గొంటారు. వీరితో పాటు ఏపీ మంత్రి లోకేశ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, TN మంత్రి టీఆర్‌బీ రాజా, యూపీ మంత్రి సురేశ్ ఖన్నా తదితరులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.