News June 11, 2024
యెమెన్‌లో పడవ మునిగి 49 మంది మృతి
యెమెన్ తీర ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వలసదారుల పడవ మునిగి 49 మంది సోమాలియన్లు, ఇథియోపియన్లు మరణించినట్లు యూఎన్ అంతర్జాతీయ శరణార్థుల సంస్థ తెలిపింది. మరో 140 మంది గల్లంతవగా, 71 మందిని కాపాడినట్లు పేర్కొంది. మరణించిన వారిలో 31 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించింది.
Similar News
News December 27, 2024
మన్మోహన్‌ను ప్రధాని చేసిన సోనియా గాంధీ
కాంగ్రెస్ నేతృత్వంలోని UPA 2004లో అధికారంలోకి రావడంతో సోనియా ప్రధాని అవుతారని వార్తలు వచ్చాయి. విదేశీయురాలనే కారణంతో సుష్మా స్వరాజ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ తదితర సీనియర్ నేతలు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో సోనియా అనూహ్యంగా మన్మోహన్‌కు ప్రధాని పగ్గాలు అప్పగించారు. 2009లో రెండోసారి కూడా ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం కాకుండా సింగ్‌కే అవకాశం ఇచ్చారు. 2014లో ఓడినా ఆయన్ను ఎవరూ నిందించలేదు.
News December 27, 2024
రేపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: వేణుగోపాల్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచనున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.
News December 27, 2024
PHOTO: పాకిస్థాన్‌లో మన్మోహన్ సింగ్ ఇల్లు
మన్మోహన్ తన జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. 1932లో ఇప్పటి పాకిస్థాన్‌లోని గాహ్ అనే మారుమూల గ్రామంలో జన్మించి, స్కూల్ విద్యను అక్కడే అభ్యసించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ఇండియాకు వలస వచ్చింది. చిన్న వయసులోనే తల్లి మరణించడంతో నానమ్మ వద్ద పెరిగారు. 1991, 2008లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని మన్మోహన్ తన పనితీరుతో గట్టెక్కించారు. పై ఫొటోలో PAKలోని మన్మోహన్ ఇల్లు, స్కూలు చూడొచ్చు.