News June 11, 2024

10 రాజ్యసభ MP సీట్లకు త్వరలో ఎన్నిక?

image

దేశవ్యాప్తంగా 10 మంది రాజ్యసభ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఆ 10 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అస్సాం నుంచి కామాఖ్య ప్రసాద్& శ‌ర్బానంద సోనోవాల్, బిహార్ నుంచి మిసా భారతి & వివేక్ ఠాకూర్, హరియాణా నుంచి దీపేందర్ సింగ్ హుడా, MP నుంచి జ్యోతిరాదిత్య సింధియా, MH నుంచి ఉదయన్రాజే భోంస్లే & పీయూష్ గోయల్, RJ నుంచి కేసీ వేణుగోపాల్, త్రిపుర నుంచి బిప్లవ్ కుమార్ దేవ్ లోక్‌సభ MPలుగా గెలిచారు.

Similar News

News February 1, 2026

గుడి మాఢవీధుల పక్కనే ఇల్లు ఉండవచ్చా?

image

దేవాలయానికి అతి సమీపంలో నివాస గృహాలు ఉండటం అంత శ్రేయస్కరం కాదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. ‘మాడవీధి దాటి ఇల్లు ఉండాలి. ఇంట్లో నిత్యం జరిగే జనన, మరణాల వంటి అశౌచాలు లేదా ఇతర లౌకిక కార్యకలాపాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావం దేవాలయ పవిత్రతకు భంగం కలిగించవచ్చు. అందుకే ఆధ్యాత్మిక శక్తికి, మానవ జీవనానికి మధ్య మాడవీధి ఓ రక్షణ సరిహద్దుగా ఉంటూ, దోషాలు తగలకుండా కాపాడుతుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News February 1, 2026

ఆస్ట్రేలియాతో సిరీస్.. క్లీన్‌స్వీప్ చేసిన పాక్

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లోనూ పాకిస్థాన్ 111 పరుగుల తేడాతో విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 96 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను పాక్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన పాక్ ప్లేయర్ బాబర్.. T20Iలలో అత్యధిక అర్ధ శతకాలు(39) చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ క్రమంలో కోహ్లీ(38) రికార్డును బద్దలుకొట్టారు.

News February 1, 2026

KCRతో కేటీఆర్, హరీశ్ రావు భేటీ

image

TG: సిట్ విచారణ అనంతరం BRS అధినేత KCRతో కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు సహా లాయర్లు భేటీ అయ్యారు. విచారణ జరిగిన తీరు, అధికారుల ప్రశ్నల సరళిపై చర్చిస్తున్నారు. తర్వాత పరిణామాలపై డిస్కస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు BRS భవన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు KCR రాకకోసం వేచిచూస్తున్నారు.