News June 12, 2024

VZM: నేడు ఆలస్యంగా విశాఖపట్నం-బెనారస్ రైలు

image

రైలు నెంబరు 18311 విశాఖపట్నం నుంచి బెనారస్ వెళ్ళే రైలు నేడు తెల్లవారుజామున 04.20 విశాఖపట్నంలో బయలుదేరే బదులు ఉదయం 07.05 గంటలకు బయలుదేరుతుందని రైల్వే వర్గాలు తెలిపారు. కొత్తవలసకు ఉదయం 07.35 గంటలకు వస్తుందని తెలిపారు. ఆలస్యానికి చింతిస్తున్నామని రైల్వే అధికారులు కోరారు. ప్రయాణీకులు గమనించాలని ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News

News November 4, 2025

ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉండండి: VZM JC

image

జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని JC సేథుమాధవన్ పేర్కొన్నారు. అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కామన్ వెరైటీకి క్వింటాకు రూ.2369, గ్రేడ్-ఏ రూ.2389 మద్దతు ధరగా నిర్ణయించారని తెలిపారు. విజయనగరం జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాకు ఒక కోటి గోనె సంచులు అవసరం అవుతాయని, 50 లక్షల గోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News November 4, 2025

VZM: రూ.55 కోట్లతో 109 చెరువుల అభివృద్ధి

image

విజయనగరం జిల్లాలో 109 చిన్నతరహా చెరువులను రూ.55 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. చెరువుల అభివృద్ధిపై నేడు సమావేశం నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ పథకం క్రింద ఐదు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో ఈ చెరువులు అభివృద్ధి కానున్నాయని చెప్పారు. మొత్తం మూడు విడతల్లో అభివృద్ధి చేయాలని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలన్నారు.

News November 4, 2025

యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష: విజయనగరం ఎస్పీ

image

జామి మండలం మాదవరాయమెట్ట గ్రామానికి చెందిన వంతల శివ (23)పై పోక్సో కేసులో నేరం రుజువై 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధిత బాలికకు రూ.50వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. కేసు దర్యాప్తు చేసి, నిందితుడిని శిక్షించడంలో జామి పోలీసుల కృషిని ఎస్పీ అభినందించారు. 2024లో బాలికపై అత్యాచారానికి పాల్పాడగా శిక్ష ఖరారైందని తెలిపారు.