News June 12, 2024
అందోల్: “ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం”

ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించే విషయంలో హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలన్నారు. హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. హోటల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News January 1, 2026
మెదక్ జిల్లాలో రూ.21.32 కోట్లు తాగేశారు

నూతన సంవత్సర వేడుకల వేళ 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మెదక్ జిల్లాలో రూ. 21.32 కోట్ల విలువైన మద్యం తాగేశారు. అవును డిసెంబర్ 30, 31న రెండు రోజుల్లో చిన్నఘనపూర్ ఐఎంఎల్ డీపో నుంచి వైన్స్ వ్యాపారులు కొనుగోలు చేశారు. డిసెంబర్ నెలలో మొత్తం రూ.209 కోట్ల 50 లక్షలు మద్యం అమ్మకాలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల్లోనే రూ. 21 కోట్ల 32 లక్షల మద్యం లాగించేశారు.
News January 1, 2026
భారీ పొగమంచు.. వాహనదారులకు ఎస్పీ అలర్ట్

మెదక్ జిల్లాలో ఉదయం భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో ప్రధాన, జాతీయ రహదారులపై దృశ్యమానత గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పొగమంచు సమయంలో వేగం తగ్గించి, హెడ్‌లైట్లు ఆన్ చేసి, వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని తెలిపారు. ద్విచక్ర, భారీ వాహనాల డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు.
News January 1, 2026
మెదక్: భార్యను హత్య చేసిన భర్త.. జీవిత ఖైదు

తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో భార్య నాగరాణిను హత్య చేసిన భర్త ఊషణగళ్ల చంద్రం అనే వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2021 ఆగస్టు 27న దంపతుల మధ్య గొడవ జరగగా భార్యను భర్త కొట్టి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో జైలు శిక్ష విధించినట్లు వివరించారు. శిక్ష పడేందుకు కృషిచేసిన సిబ్బందిని అభినందించారు.


