News June 12, 2024

నేడే CM ప్రమాణస్వీకారం.. తూ.గో. జిల్లాలో ఏర్పాట్లు

image

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన మంత్రివర్గం సైతం ఏర్పాటుకానుంది. ఈ నేపథ్యంలో సదరు కార్యక్రమాన్ని వీక్షించేలా.. ఉమ్మడి తూ.గో. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అధికారులు LED స్క్రీన్లు, టీవీలను ఏర్పాటుచేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే విద్యుత్ కాంతుల నడుమ సిద్ధం చేశారు.
– మీ వద్ద పరిస్థితి ఏంటి..?

Similar News

News January 17, 2026

అందరినీ అలరించడం చిరంజీవికే సాధ్యం: వీవీ వినాయక్

image

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం తన స్వగ్రామమైన చాగల్లులో పర్యటించారు. సంక్రాంతి సెలవుల్లో స్నేహితులతో కలిసి సొంత థియేటర్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే మెగాస్టార్ ఆకాంక్ష అని ఆయన కొనియాడారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. పండుగ పూట వినాయక్ రాకతో గ్రామంలో సందడి నెలకొంది.

News January 15, 2026

తూ.గో: యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

image

భక్తుడికి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తే ఉరుకోడని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల పేర్కొన్నారు. ఫ్లెక్సీ ఘటనలో అరెస్టై, విడుదలైన వైసీపీ కార్యకర్తలను తూర్పు చోడవరంలో బుధవారం ఆమె పరామర్శించారు. వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి భక్తులకు అన్యాయం జరిగిందంటే దేవుడు ఊరుకోడని, తప్పకుండా స్పందిస్తారని ఆమె వెల్లడించారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.

News January 15, 2026

కొవ్వూరు: కోడిపందేల్లో గెలిస్తే మోటార్ సైకిళ్లు గిఫ్ట్

image

కొవ్వూరు మండలం ఐపంగిడిలో బుధవారం కోడిపందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. పందేల్లో గెలిచిన పుంజుల యజమానులకు మోటార్ సైకిళ్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించి, బరుల వద్ద వాటిని ప్రదర్శనకు ఉంచారు. ఒక శిబిరంలో ఆరు పుంజుల పోటీలో నెగ్గిన వారికి, మరోచోట ఇద్దరు విజేతలకు బైక్‌లు అందజేస్తామన్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇలాంటి భారీ ఆఫర్లు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.