News June 12, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం
నీళ్లలోని మీను నెఱిమాంస మాశించి
గాలమందు జిక్కుకరణి భువిని
ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: నీటిలోని చేప మాంసమును ఆశించి గాలానికి చిక్కుకున్నట్లు.. భూమి మీద మానవుడు ఆశ వల్ల నష్టపోతాడు.
Similar News
News December 28, 2024
TODAY HEADLINES
☛ మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి
☛ మన్మోహన్ గొప్ప పార్లమెంటేరియన్: ప్రధాని మోదీ
☛ విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల పోరుబాట
☛ MPDOపై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్
☛ రిజర్వేషన్లు ప్రకటించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి: కవిత
☛ మన్మోహన్ సహకారం మరువలేనిది: KCR
☛ బాక్సింగ్‌డే టెస్టు: 5 వికెట్లు కోల్పోయిన భారత్
News December 28, 2024
రాజమౌళి SSMB29 నుంచి క్రేజీ అప్‌డేట్!
దేశంలోనే క్రేజీయెస్ట్ ప్రాజెక్టుగా ఇప్పటికే హైప్ దక్కించుకున్న రాజమౌళి-SSMB29 చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్‌కు ప్రియాంకా చోప్రా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అలాగే మరో కీలక పాత్రలో మలయాళ విలక్షణ నటుడు పృథ్విరాజ్ నటించనున్నట్లు ఫిలిం నగర్ టాక్. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంక్రాంతి తరువాత జరగొచ్చని సమాచారం.
News December 28, 2024
ప్రొ కబడ్డీ సీజన్-11.. ఫైనల్‌కు పట్నా పైరేట్స్
ప్రొ కబడ్డీ సీజన్-11లో పట్నా పైరేట్స్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్-2లో ఢిల్లీ దబాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 32-28 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో హరియాణా, పట్నా జట్లు తలపడనున్నాయి. తొలి సెమీస్‌లో యూపీ యోధాస్‌పై 28-25 తేడాతో హరియాణా గెలిచింది.