News June 12, 2024
చంద్రబాబు రాజకీయ ప్రయాణం
✒ రాజగోపాల్ నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి..
✒ 1978లో INC తరఫున చంద్రగిరి MLAగా విజయం
✒ టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో మంత్రి
✒ 1982లో టీడీపీలో చేరిక.. 1983లో చంద్రగిరిలో ఓటమి
✒ 1989 నుంచి వరుసగా 8 సార్లు కుప్పం ఎమ్మెల్యేగా గెలుపు
✒ 1995, 1999లో ఉమ్మడి ఏపీ సీఎం, 2014లో విభజిత ఏపీ సీఎం
✒ 2004-14, 2019-24 ప్రతిపక్ష నేత
✒ ఇవాళ నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు.
Similar News
News December 23, 2024
సంభల్: ఆ మెట్లబావి, సొరంగానికి ‘సిపాయిల తిరుగుబాటు’తో అనుబంధం
UP సంభల్ ఆక్రమణల తొలగింపుతో మన గత చరిత్ర వెలుగుచూస్తోంది. తాజాగా బయటపడ్డ సొరంగం, మెట్లబావి 150 ఏళ్ల క్రితానివని భావిస్తున్నారు. 1857లో బ్రిటిషర్లపై సిపాయిల తిరుగుబాటును ప్రప్రథమ స్వాతంత్ర్య సమరంగా చెప్తారు. అప్పటి సిపాయిలకిది ఎస్కేప్ రూట్‌గా ఉపయోగపడిందని సమాచారం. ఆదివారం ASI టీమ్ సంభల్‌లో 5 పవిత్ర స్థలాలు, 19 బావులను సర్వే చేసింది. తవ్వేకొద్దీ ఇక్కడ మరింత చరిత్ర బయటపడొచ్చని అధికారులు అంటున్నారు.
News December 23, 2024
శ్రీతేజ్ కోలుకోవాలని బన్నీ మృత్యుంజయ యాగం చేయాలి: VH
TG: బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ప్రశ్నించారు. తెలంగాణలో లా&ఆర్డర్ అదుపు తప్పకూడదని సీఎం రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారని, దీనిపై అల్లు అర్జున్ ఆలోచించాలని సూచించారు. శ్రీతేజ్ కోలుకోవాలని బన్నీ మృత్యుంజయ యాగం చేయాలన్నారు. BJP, BRSలు శవాల మీద పేలాలు ఏరుకునే రకమని, ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు ఆపాలని కోరారు.
News December 23, 2024
వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి: భట్టి
TG: త్వరలో రీజినల్ రింగ్ రోడ్ పనులకు టెండర్లు పిలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నాం. మ్యాచింగ్ గ్రాంట్లు, సబ్సిడీ పథకాలు మంజూరు చేసి రాష్ట్ర ప్రజలకు సహకరించాలి. వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి’ అని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ రివ్యూ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.