News June 12, 2024
రైల్వేమంత్రిపై కాంగ్రెస్ సెటైర్
అశ్వినీ వైష్ణవ్‌కు మరోసారి రైల్వేమంత్రి పదవి దక్కడంపై కేరళ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ముంబై సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వేలాది మంది చేరుకున్నారని ఓ ఫొటోను షేర్ చేసింది. అక్కడికి వచ్చిన వారందరికీ వందే భారత్ హైక్వాలిటీ డ్రోన్ వీడియోలు ఇస్తారని తెలిపింది. అశ్వినీ వైష్ణవ్ హయాంలో రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేసింది.
Similar News
News December 23, 2024
DHOP మూమెంట్.. స్టార్ హీరోలతో తమన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోలను దర్శకుడు బుచ్చిబాబు తమన్ పంచుకున్నారు. ‘DHOP మూమెంట్’ అంటూ తమన్, నా అభిమాన హీరోలంటూ బుచ్చిబాబు రాసుకొచ్చారు. వీరంతా దుబాయ్‌లో ఓ ఈవెంట్ సందర్భంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ‘వార్-2’ చిత్రంలో నటిస్తున్నారు. కాగా RC నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.
News December 23, 2024
FEB 1: సెలవు రోజైనా స్టాక్‌మార్కెట్లు పనిచేస్తాయ్
2025 FEB 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. ఆ రోజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. అందులో ప్రకటనలను అనుసరించి సత్వర నిర్ణయాలు తీసుకొనేందుకు ఇన్వెస్టర్లకు అవకాశమివ్వడమే దీని ఉద్దేశం. 2020, 2015లోనూ ఇలాగే జరిగింది. సాధారణంగా బడ్జెట్ రోజు బ్యాంకింగ్, ఇన్ఫ్రా, తయారీ, హెల్త్‌కేర్ షేర్లలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ రేట్లు నిమిషాల్లో ఆటుపోట్లకు లోనవుతుంటాయి.
News December 23, 2024
‘నో డిటెన్షన్’ విధానం రద్దు
స్కూళ్లలో ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని పేర్కొంది. ఫెయిలైన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం ద్వారా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లతో పాటు KVలు, నవోదయ, సైనిక్ స్కూళ్లకు ఇది వర్తించే అవకాశం ఉంది.