News June 12, 2024

త్వరలో భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం?

image

TG: భూ సమస్యల పరిష్కారానికి కామన్ రెవెన్యూ కోడ్ తేవాలని ధరణి కమిటీ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే చట్టంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అలాగే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో రైతుల భూములకు హద్దులు నిర్ణయించాలని, పక్కా విస్తీర్ణంతో పాస్‌బుక్‌లు జారీ చేయాలంటోంది. వీటితో పాటు గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది.

Similar News

News December 23, 2024

FEB 1: సెలవు రోజైనా స్టాక్‌మార్కెట్లు పనిచేస్తాయ్

image

2025 FEB 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. ఆ రోజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. అందులో ప్రకటనలను అనుసరించి సత్వర నిర్ణయాలు తీసుకొనేందుకు ఇన్వెస్టర్లకు అవకాశమివ్వడమే దీని ఉద్దేశం. 2020, 2015లోనూ ఇలాగే జరిగింది. సాధారణంగా బడ్జెట్ రోజు బ్యాంకింగ్, ఇన్ఫ్రా, తయారీ, హెల్త్‌కేర్ షేర్లలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ రేట్లు నిమిషాల్లో ఆటుపోట్లకు లోనవుతుంటాయి.

News December 23, 2024

‘నో డిటెన్షన్’ విధానం రద్దు

image

స్కూళ్లలో ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని పేర్కొంది. ఫెయిలైన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం ద్వారా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లతో పాటు KVలు, నవోదయ, సైనిక్ స్కూళ్ల‌కు ఇది వర్తించే అవకాశం ఉంది.

News December 23, 2024

ఖేల్‌రత్న జాబితా వివాదం: మనూభాకర్ పేరు డిలీట్?

image

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూభాకర్ పేరు తొలగించినట్టు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది. వివాదం నెలకొనడంతో అవార్డుకు ఆమె దరఖాస్తు చేసుకోలేదని స్పోర్ట్స్ మినిస్ట్రీ చెప్తోంది. అది అవాస్తవమని, తాము చేశామని ఆమె తండ్రి రామకృష్ణ స్పష్టం చేశారు. అవార్డుల కోసం అడుక్కోవాల్సి వస్తే మెడల్స్ సాధించడంలో అర్థమేముందని ప్రశ్నించారు.