News June 12, 2024
GREAT: తలలోకి బుల్లెట్ దూసుకెళ్లినా..

J&Kలో బస్సు డ్రైవర్ తెగువతో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయి. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై టెర్రరిస్టుల కాల్పుల్లో 9 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. డ్రైవర్ విజయ్ కుమార్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయినా బస్సు ఆపకపోవడంతో అది లోయలో పడి కొంతమందికి గాయాలయ్యాయి. ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. బస్సును ఆపి ఉంటే ఉగ్రవాదులు చొరబడి అందరినీ చంపేసేవారు. ఆ ఘటనలో విజయ్ తీవ్రగాయాలతో అమరుడయ్యాడు.
Similar News
News October 28, 2025
‘భారత్’ అనే శబ్దానికి అర్థమిదే..

‘భా’ అంటే జ్ఞానం. ‘ర’ అంటే ఆనందించడం. ‘త’ అంటే తరింపజేయడం. జ్ఞాన మార్గంలో ఆనందంగా ఉంటూ ఇతరులను కూడా తరింపజేసేవాడే భారతీయుడు అని దీనర్థం. అందుకే ఇది కర్మభూమిగానూ ప్రసిద్ధి చెందింది. అంటే.. ఇక్కడ మన కర్మల ద్వారా మోక్షాన్ని, ముక్తిని సాధించుకోవచ్చని అంటారు. భారతదేశం ఆత్మజ్ఞానాన్ని, తత్వ వివేకాన్ని పొందేందుకు, జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అత్యంత అనువైన, పవిత్రమైన దేశంగా పరిగణిస్తారు. <<-se>>#Sanathana<<>>
News October 28, 2025
వంటింటి చిట్కాలు

* టమాటాలు మగ్గిపోకుండా ఉండాలంటే, వాటిని కాగితం సంచిలో ఉంచి దానిలో ఓ యాపిల్‌ను పెట్టండి.
* ఖాళీ అయిన పచ్చడి సీసాలో దాని తాలూకు ఘాటు వాసన పోవాలంటే సగం వరకు గోరువెచ్చని నీరు నింపి రెండు చెంచాల వంటసోడా కలిపి కాసేపు వదిలేయండి. తరువాత శుభ్రంగా కడిగి వాడుకోండి.
* కేక్ తయారు చేసేటప్పుడు గుడ్డు, మైదా మిశ్రమం కాస్త మెత్తగా ఉండేట్లు చూసుకోండి. లేదంటే కేకు గట్టిగా, పొడిబారినట్లు అవుతుంది.
News October 28, 2025
భారీ వర్షాలు.. అన్నదాతలకు సూచనలు

భారీ వర్షం సమయంలో నీళ్లను బయటకు పంపాలని పొలానికి వెళ్లొద్దు. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత పరిస్థితిని బట్టి వెళ్లండి. నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటి తీరం వద్దకు వెళ్లొద్దు. నీరు ప్రవహిస్తున్న రహదారులు, వంతెనలను దాటేందుకు ప్రయత్నించవద్దు. విద్యుత్ మోటార్లు, స్తంభాలను తాకవద్దు. వాటి దగ్గరకు వెళ్లవద్దు. పిడుగు పడే సమయంలో చెట్లకింద ఉండొద్దు. పిడుగులు పడేటప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.


