News June 12, 2024

T20 ప్రపంచకప్.. 5.4 ఓవర్లలోనే కొట్టేశారు!

image

T20 WC: నమీబియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 73 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 5.4 ఓవర్లలోనే ఛేదించింది. మరో 86 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఫినిష్ చేసింది. హెడ్ (17 బంతుల్లో 34*), వార్నర్ (8 బంతుల్లో 20), మార్ష్ (9 బంతుల్లో 18*) చెలరేగారు. ఈ విజయంతో కంగారూలు సూపర్-8కు క్వాలిఫై అయ్యారు.

Similar News

News December 23, 2024

బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్వాగతించిన ఫిల్మ్ ఎగ్జిబిటర్లు

image

TG: బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలోనే, సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటే ప్రేక్షకులు చూడటానికి వస్తారని తెలిపారు.

News December 23, 2024

మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

TG: మోహన్‌బాబు‌కు హైకోర్టులో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు మోహన్‌బాబును అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

News December 23, 2024

ఏడాదిలో ₹16 నుంచి ₹1702కు పెరిగిన షేర్లు.. సస్పెండ్ చేసిన సెబీ

image

భారత్ గ్లోబల్ డెవలపర్స్ (BGDL)పై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అవినీతి, అవకతవకలకు పాల్పడుతోందన్న ఫిర్యాదులు రావడంతో షేర్ల ట్రేడింగును నిలిపివేసింది. 2020, జులై వరకు ఐదుగురు ప్రమోటర్లకు 16.77% (93,860 షేర్లు) వాటా ఉండగా ప్రస్తుతం 100% పబ్లిక్ వద్దే ఉన్నట్టు సెబీ గమనించింది. ఆస్తులు, అప్పులు, ఖర్చులు పెంచి చూపినట్టు కనుగొంది. 2024 ఆరంభంలో రూ.16గా ఉన్న ఈ షేర్లు 105 రెట్లు పెరిగి రూ.1702కు చేరాయి.