News June 12, 2024

నెల్లూరు: నాడు టీచర్.. నేడు మినిస్టర్

image

MSc, PhD చేసిన పొంగూరు నారాయణ నెల్లూరులోని VR కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం 1979లో ఓ చిన్న అద్దె గదిలో ట్యూషన్ సెంటర్‌గా మొదలైన ఆ ప్రస్థానం అనతికాలంలోనే దేశమంతా విస్తరించింది. 1999లో వైద్యకళాశాలను నెల్లూరులో స్థాపించారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగానూ, రాజధాని అమరావతి నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో 72వేల మెజార్టీతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.

Similar News

News November 17, 2024

వెంకటగిరిలో చికెన్ ధర రూ.210

image

ఆదివారం మాంసం విక్రయాలకు ఉన్న డిమాండ్ చెప్పనవసరం లేదు. సామాన్యులు ఆదివారం రోజైనా మాంసం తినాలని కోరుకుంటారు. పెరిగిన ధరలతో ప్రజలు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రస్తుతం వెంకటగిరిలో చికెన్ కిలో రూ.210గా ఉంది. నాటు కోడి ధరలు కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కిలో రూ.600పైగా ఉన్నట్లు సమాచారం. ఇక పొట్టేలు మాంసం ధర రూ.700, మేకపోతు మాంసం ధర కిలో రూ.800 వరకు ఉంది. మీ ఊరిలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 17, 2024

నెల్లూరు: ఉరి వేసుకున్న యువకుడు

image

నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నఘటన శనివారం వెంకటాచలం మండలంలో వెలుగుచూసింది. జాకీర్ హుస్సేన్‌నగర్‌కు చెందిన గండికోట సురేంద్రబాబు(36) పాలిచెర్లపాడు వద్ద అడవిలో ఉరి వేసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం కోసం బాడీని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబీకులకు సమాచారం అందించారు.

News November 16, 2024

నెల్లూరు: కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

image

చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సొన కాలువలో పడి  అల్లిపురం గిరిజన కాలనీకి చెందిన నాగేంద్రమ్మ(11), చింతాలయ్య(11) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.