News June 12, 2024
పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు!

TG: టోల్ ప్లాజాలున్న మార్గాల్లో నడిచే బస్సుల్లో టికెట్ ఛార్జీలోని టోల్ రుసుమును RTC ₹3 చొప్పున పెంచింది. కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలు పెంచడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్‌లో ₹10 నుంచి ₹13కు, డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో ₹13 నుంచి ₹16కు, గరుడ ప్లస్‌లో ₹14 నుంచి ₹17కు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్‌లో ₹15 నుంచి ₹18కి, AC స్లీపర్‌లో ₹20 నుంచి ₹23కు పెంచింది.
Similar News
News September 12, 2025
మేం చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించింది: బుగ్గన

AP:YCP ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తోందంటూ ఆనాడు TDP ఆరోపించిందని మాజీ మంత్రి బుగ్గన Way2News కాన్‌క్లేవ్‌లో చెప్పారు. వాటిని మించి ఇచ్చిన అభివృద్ధి హామీలను నెరవేర్చాలని, లేకపోతే తప్పు చేసినట్లు ప్రభుత్వం ఒప్పుకోవాలని కోరారు. YCP హయాంలో చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించిందన్నారు. తమ ప్రభుత్వంలో GST వసూళ్లు పెరిగితే, కూటమి ప్రభుత్వ హయాంలో ఎందుకు పెరగడంలేదని ప్రశ్నించారు.
News September 12, 2025
గత ప్రభుత్వ పాలన అమరావతి నుంచే నడిచింది: సజ్జల

AP: రాజధానిలో ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ చాలు అని.. కొత్త కట్టడాలేమీ అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని, గత ప్రభుత్వ పాలన అక్కడి నుంచే నడిచిందని వివరించారు. విశాఖ నుంచి పాలన చేద్దామని జగన్ అనుకున్నారని, అయితే ఎన్నికలు రావడంతో అది కుదరలేదని చెప్పారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖతో పాటు అమరావతి కూడా అభివృద్ధి అయ్యేదని చెప్పారు.
News September 12, 2025
రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా: సజ్జల

రాజధానిలో ఎవరైనా ఇండస్ట్రీలు కడతారా అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి కోసం చేసిన రూ.లక్షల కోట్ల అప్పు ఎలా తీరుస్తారని ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకువచ్చి అయినా రాజధాని కడితే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ రూ.లక్ష కోట్లు ఇప్పటికే రాజధాని పేరుతో వృథా చేశారు. వైజాగ్, కర్నూలు, విజయవాడలో కూడా రాజధాని పెట్టొచ్చు’ అని సజ్జల వ్యాఖ్యానించారు.