News June 12, 2024
రియాసి ఉగ్రదాడి.. ముష్కరుడి ఊహా చిత్రం రిలీజ్

జమ్మూకశ్మీర్‌లోని రియాసిలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకరి ఊహాచిత్రాన్ని పోలీసులు రిలీజ్ చేశారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి రూ.20లక్షల రివార్డ్ అందిస్తామని ప్రకటించారు. ప్రత్యక్షసాక్షులు చెప్పిన గుర్తుల ఆధారంగా ఈ స్కెచ్ రూపొందించినట్లు తెలిపారు. ఉగ్రవాదుల కోసం 11 బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. కాగా ఉగ్రవాదుల దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా మరో 41 మంది గాయపడ్డారు.
Similar News
News November 9, 2025
రేపు క్యాబినెట్ భేటీ.. CII సమ్మిట్‌పై కీలక చర్చ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే CII సమ్మిట్ ప్రధాన ఎజెండాగా సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటు రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావం, పంట నష్టం అంచనాలు, రైతులకు అందించాల్సిన పరిహారంపై చర్చించనున్నారు.
News November 9, 2025
MLAపై రేప్ కేసు.. AUSకు జంప్.. మళ్లీ ఆన్‌లైన్‌లో..!

రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ ఆప్ MLA హర్మిత్ సింగ్ ఆస్ట్రేలియాకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. తనకు బెయిల్ వచ్చిన తర్వాతే తిరిగొస్తానని తాజాగా ఆన్‌లైన్ వేదికగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 2న పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న హర్మిత్ అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. తనను ఫేక్ ఎన్‌కౌంటర్ చేస్తారనే భయంతో పారిపోయినట్లు ప్రచారం జరిగింది.
News November 9, 2025
బాధపడొద్దు.. తెల్ల జుట్టు మంచిదే : సైంటిస్ట్‌లు

జుట్టు తెల్లబడటం మంచిదే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. శరీరంలో క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నాశనం చేసే ప్రాసెస్‌లో జుట్టు రంగు కోల్పోతుందని చెబుతున్నారు. మెలనోసైట్ సెల్స్ కారణంగా జుట్టు నల్లగా ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడే ఈ కణాలు జుట్టుకు రంగును అందిస్తాయని అంటున్నారు. శరీరంలో క్యాన్సర్‌గా మారే కణాలను అంతం చేసే ప్రక్రియలో మెలనోసైట్స్ తమను తాము చంపుకుంటాయని స్పష్టం చేస్తున్నారు.


