News June 12, 2024
గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా వచ్చిన ఆయనకు గవర్నర్, చంద్రబాబు స్వాగతం పలికారు. కాసేపట్లో ముగ్గురూ గన్నవరం ఐటీ పార్కులోని ప్రమాణస్వీకార సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు.
Similar News
News October 31, 2025
కృష్ణా జిల్లాలో పలు మండలాలకు క్రీడా సామాగ్రి సరఫరా

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పమిడిముక్కల, ఉయ్యూరు మండలాల క్లస్టర్ పాఠశాలలకు క్రీడా పరికరాలు సరఫరా చేయనున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష అధికారులు కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు రాంబాబు, అరుణ తెలిపారు. సంబంధిత మండలాల పీఈటీలు వారి క్లస్టర్‌కు కేటాయించిన స్పోర్ట్స్ మెటీరియల్‌ను స్వీకరించుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News October 30, 2025
కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.
News October 30, 2025
కోడూరు: పవన్ పంట పొలాలను పరిశీలించే స్థలం ఇదే.?

తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. కోడూరు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాపురం ఆర్సీఎం చర్చి వద్ద తుపాన్ తాకిడికి నేలకి వోరిగిన వరిపైరును పరిశీలించనున్నారు. వ్యవసాయ అధికారులు తుపాన్ నష్టాన్ని అంచనా వేసి పవన్‌కి వివరించనున్నారు. పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


