News June 12, 2024
పవన్ ప్రమాణ స్వీకారానికి పంచెకట్టులో అకీరా
AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన కుమారుడు అకీరా నందన్, ఆద్య మెరిశారు. అకీరా పంచెకట్టులో అచ్చతెలుగు కుర్రాడిలా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైనట్లు తెలుస్తోంది.
Similar News
News December 23, 2024
బీసీలకు 34శాతం రిజర్వేషన్లు: చంద్రబాబు
AP: నామినేటెడ్ పోస్టుల్లో BCలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఆయన సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయపరమైన పోరాటం చేయాలని అధికారులకు ఆదేశించారు. అటు బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పన, బాలికల హాస్టళ్లకు తక్షణం మరమ్మతులు చేయాలని CM సూచించారు. అలాగే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై ఆరా తీశారు.
News December 23, 2024
విష్ణుతో ప్రాణహాని.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు!
TG: మంచు ఇంట మరోసారి వివాదం చెలరేగింది. తాజాగా తన సోదరుడు విష్ణుతో పాటు అతని అనుచరుడు వినయ్‌పై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విష్ణు నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ 7 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.
News December 23, 2024
ఈ నెల 30న క్యాబినెట్ భేటీ
తెలంగాణ క్యాబినెట్ భేటీ ఈ నెల 30న జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 20 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా సహా మరికొన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.