News June 12, 2024
పవన్‌ను క్లిక్‌మనిపించిన అన్నా లెజినోవా

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మధుర క్షణాలను ఆయన భార్య అన్నా లెజినోవా తన సెల్‌ఫోన్‌లో బంధించారు. ఆమె ఓ వైపు ఫొటోలు తీస్తూనే.. మరోవైపు తన భర్త గెలుపును ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Similar News
News January 16, 2026
IBPS ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల

2026-27కు సంబంధించిన ఎగ్జామ్ క్యాలెండర్‌ను IBPS రిలీజ్ చేసింది.
* ప్రొబెషనరీ ఆఫీసర్స్ (PO), మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (MT): ప్రిలిమినరీ ఎగ్జామ్స్ 2026 ఆగస్టు 22, 23 తేదీల్లో, అక్టోబర్ 4న మెయిన్ ఎగ్జామ్
* స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO): ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 29, మెయిన్ నవంబర్ 1
* కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA): ప్రిలిమినరీ అక్టోబర్ 10, 11. మెయిన్ డిసెంబర్ 27. పూర్తి వివరాలకు <
News January 16, 2026
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా!

ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా EPF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిద్వారా నేరుగా లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి PFను ట్రాన్స్‌ఫర్ చేసే విధానం రానుందని పేర్కొన్నాయి. UPI పిన్ ఎంటర్ చేసి క్షణాల్లోనే నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపాయి. ఈ విధానం అమలుకు సమస్యల పరిష్కారంపై EPFO ఫోకస్ చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
News January 16, 2026
NZతో టీ20 సిరీస్.. సుందర్ దూరం, జట్టులోకి శ్రేయస్

NZతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ మార్పులు చేసింది. గాయంతో వాషింగ్టన్ సుందర్ దూరమైనట్లు ప్రకటించింది. అతడి స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేసింది. అలాగే తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్ టీమ్‌లోకి వచ్చారని తెలిపింది.
టీమ్: సూర్య (C), అభిషేక్, శాంసన్, శ్రేయస్, హార్దిక్, దూబే, అక్షర్, రింకూ, బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్, రవి బిష్ణోయ్


