News June 12, 2024
మంత్రిగా సత్యకుమార్ ప్రమాణం

ఏపీ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కూటమిలో బీజేపీ నుంచి మంత్రి పదవి పొందిన ఏకైక ఎమ్మెల్యే సత్య. ధర్మవరం నుంచి కేతిరెడ్డిపై గెలుపొందిన ఈయనకు ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి.
Similar News
News September 12, 2025
నేడే లాస్ట్.. టెన్త్ అర్హతతో 515 పోస్టులు

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) 515 ఆర్టిసన్ గ్రేడ్ 4 పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. అభ్యర్థులు టెన్త్, ఐటీఐ పాసై 27 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.29,500 నుంచి రూ.65,000 వరకు ఉంటుంది. నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి https://careers.bhel.in/ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News September 12, 2025
నేడు విజయవాడలో Way2News కాన్‌క్లేవ్

AP: విజయవాడలో ఇవాళ Way2News కాన్‌క్లేవ్ నిర్వహించనుంది. CM చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, MPలు భరత్, హరీశ్ బాలయోగి పాల్గొననున్నారు. YCP నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం కాన్‌క్లేవ్‌కు హాజరుకానున్నారు. రానున్న పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుందనే వివిధ అంశాలపై వీరు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. మ.12గంటల నుంచి యాప్‌లో LIVE వీక్షించొచ్చు.
News September 12, 2025
‘కిష్కింధపురి’ పబ్లిక్ టాక్

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ నటించిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. మూవీ చూసిన వాళ్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. హీరోహీరోయిన్ల యాక్టింగ్, విజువల్స్ బాగున్నాయని అంటున్నారు. స్క్రీన్ ప్లే, సెకండాఫ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ&రేటింగ్.