News June 12, 2024
వంగలపూడి అనిత అనే నేను..

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ అనితతో పదవీ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపైన ఉన్న పెద్దలకు అనిత నమస్కరించారు.
Similar News
News November 4, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖలో పలు చోట్ల కంపించిన భూమి
➤ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
➤ మార్గశిర మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
➤ కంచరపాలెంలో నవంబర్ 7న జాబ్ మేళా
➤ శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి రైళ్లు: కేంద్ర మంత్రి
➤ కార్తీక పౌర్ణమి బీచ్ స్నానాలపై మెరైన్ పోలీసులు విజ్ఞప్తి
➤ విశాఖలో బహిరంగ మద్యపానంపై డ్రోన్‌తో నిఘా
News November 4, 2025
కేజీహెచ్‌లో హీమోడయాలసిస్ యంత్రాల ఏర్పాటు

కేజీహెచ్‌లోని ఎస్ఎస్ బ్లాక్ నెఫ్రాలజీ వార్డులో 9 హీమోడయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఓ కంపెనీ CSR నిధుల నుంచి రూ.2 కోట్లతో ఈ యంత్రాలను కేజీహెచ్‌కు అందించింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బుధవారం నుంచి వీటిని అందుబాటులోకి తేనున్నారు.
News November 4, 2025
కంచరపాలెంలో 7న జాబ్ మేళా

కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 7 కంపెనీలు పాల్గొనున్నాయి. టెన్త్,ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 18 నుంచి 33 సంవత్సరాలలోపు యువతీ, యువకులు అర్హులు. ఆసక్తి కలవారు https://www.ncs.gov.in, https://employment.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకొని నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలి.


