News June 12, 2024
మంత్రిగా డోలా ప్రమాణ స్వీకారం

కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి బుధవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. ‘ డోలా బాల వీరాంజనేయస్వామి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తాను’ అంటూ ప్రమాణం చేశారు.
Similar News
News January 16, 2026
ఒంగోలు: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మనపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నాయకుడు మృతిచెందాడు. నెల్లూరుకు చెందిన మైనార్టీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ జాఫర్ షరీఫ్(54) కారులో విజయవాడ నుంచి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. జాఫర్ షరీఫ్‌ను ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.
News January 15, 2026
ప్రకాశం: ట్రాక్టర్ రివర్స్ పోటీలు

దర్శి మండలం రాజంపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్స్ రివర్స్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతి వంటి పండుగలు గ్రామీణ క్రీడలను, రైతు సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, ఇలాంటి వినూత్న పోటీలు యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
News January 14, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజాబాబు

సంక్రాంతి పండగ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను అందరిని కలుసుకొని కను విందులు చేసే అందరి పండగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంట చేతికి వచ్చే కాలమని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు.


