News June 12, 2024
న్యూయార్క్ స్టేడియం కూల్చివేస్తారా?
భారత్-యూఎస్ఏ మధ్య జరిగే మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు స్టేడియానికి చివరిదిగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ అనంతరం స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు సమాచారం. కాగా టీ20 వరల్డ్ కప్ కోసమే ఈ స్టేడియాన్ని నిర్మించారు. రూ.240 కోట్లతో మూడు నెలల్లోనే దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్‌లు ఏర్పాటు చేశారు. టోర్నీలో ఈ మైదానంలో అన్ని మ్యాచ్‌లూ లోయెస్ట్ టోటల్‌తోనే ముగిశాయి.
Similar News
News December 23, 2024
హైకోర్టులో KCR, హరీశ్ క్వాష్ పిటిషన్
TG: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. మేడిగడ్డ నిర్మాణంలో వీరిద్దరూ అవినీతికి పాల్పడ్డారంటూ భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను కొట్టేయాలంటూ KCR, హరీశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
News December 23, 2024
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి
ప్రముఖ సినీ దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత శ్యామ్ బెనగల్(90) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలీవుడ్‌లో అంకుర్, భూమిక, నిషాంత్, కల్‌యుగ్, మంతన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. 1934లో డిసెంబర్ 14న HYD తిరుమలగిరిలో జన్మించిన ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే సహా పలు అవార్డులు వరించాయి.
News December 23, 2024
మహిళా సంఘాల ద్వారా RTCకి 150 ఎలక్ట్రిక్ బస్సులు: సీఎస్
TG: రాష్ట్రంలో తొలి విడతలో 5 జిల్లాల్లోని 231 ఎకరాల్లో స్వయం సహాయక బృందాలచే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. 6 నెలల్లో ఆలయ భూముల్లో వీటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. సోలార్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడంపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల నుంచి ఆర్టీసీకి 150 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.